వారంలో 8 ఐపిఒలు 18 నుంచి ప్రారంభం కానున్న ముతూట్ మైక్రోఫిన్ మోటిసన్స్, సూరజ్, హ్యాపీ, ఆర్‌బిజెడ్ ఇష్యూలు కూడా న్యూఢిల్లీ : వచ్చే వారం స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కోసం 8 ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)లు రానున్నాయి. వీటిలో ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్, మోటిసన్స్ జ్యువెలర్స్ లిమిటెడ్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్, హ్యాపీ ఫోర్డింగ్స్ లిమిటెడ్, ఆర్‌బిజెడ్ జ్యువెలర్స్ లిమి టెడ్, క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ లిమిటెడ్, ఆజాద్ ఇంజినీరింగ్, ఇన్నోవా క్యాప్టాబ్ లిమి టెడ్ ఉన్నాయి. ఈ అన్ని కంపెనీల ఐపిఒల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. 1. ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ ఈ ఐపిఒ ద్వారా రూ.960 కోట్లను సమీకరించాలను కుంటోంది. దీని కోసం కంపెనీ రూ.760 కోట్ల విలువైన 32,989,690 తాజా షేర్లను జారీ చేస్తోంది. ప్రస్తుతం కంపెనీకి చెందిన ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.200 కోట్ల విలువైన 6,872,852 షేర్లను విక్రయి స్తారు. రిటైల్ ఇన్వెస్టర్లు డిసెంబర్ 18 నుండి డిసెంబర్ 20 వరకు ఈ ఐపిఒకోసం దర ఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ షేర్లు డిసెంబర్ 26న నేషనల్ స్టాక్ ఎక్స్ఫేంజ్ (ఎన్‌ఎస్‌ఇ), బాంబే స్టాక్ ఎక్స్ఫేంజ్ (బిఎస్‌ఇ)లో లిస్ట్ అవు తాయి. కంపెనీ ఈ ఇష్యూ ధరను రూ.277 రూ.291గా నిర్ణయించింది. 2. మోటిసన్స్ జువెలర్స్ లిమిటెడ్ మోటిసన్స్ జువెలర్స్ లిమిటెడ్ ఈ ఐపిఒ ద్వారా రూ.151.09 కోట్లను సమీకరించనుం ది. ఈ ఐపిఒ పూర్తిగా తాజా ఇష్యూ, దీని కోసం కంపెనీ 27,471,000 షేర్లను జారీ చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు డిసెంబర్ 18 "ఇక मा న. క గండు... నుండి డిసెంబర్ 20 వరకు ఈ ఐపిఒ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ ఈ ఇష్యూ ధరను రూ.52-55గా నిర్ణయించింది. So నీ షేర్లు డిసెంబర్ 26న ఎన్‌ఎస్‌ఇ, బిఎస్‌ఇ లలో లిస్ట్ కానున్నాయి. రిటైల్ పెట్టుబడిదా రులు కనీసం ఒక లాట్ అంటే 250 షేర్లకు వేలం వేయవచ్చు. రూ.55 ఐపిఒ ఎగువ ధర బ్యాండ్‌లో 1 లాట్ కోసం దరఖాస్తు చేస్తే, రూ.13,750 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ౩. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్ ఈ ఐపిఒ ద్వారా రూ.400 కోట్ల సమీకరణ చేపడుతోం ది. ఈ ఐపిఒ కూడా పూర్తిగా తాజా ఇష్యూ, దీని కోసం కంపెనీ 11,111,111 కొత్త షేర్లను జారీ చేస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు డిసెం బర్ 18 నుండి డిసెంబర్ 2౦ వరకు ఈ ఐపిఒ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 26న కంపెనీ షేర్లు లిస్ట్ కానున్నాయి. కంపెనీ ఈ ఇష్యూ ధరను రూ.340-360గా నిర్ణ యించింది. రిటైల్ పెట్టుబడిదారులు కనీసం ఒక లాట్ అంటే 41 షేర్లకు వేలం వేయవచ్చు. ఐపిఒ గరిష్ట ధర బ్యాండ్‌లో రూ. ౩60 వద్ద 1 లాట్ కోసం దరఖాస్తు చేస్తే, రూ.14,760 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 4. హ్యాపీ ఫోర్డింగ్స్ లిమిటెడ్ హ్యాపీ ఫోర్టింగ్స్ లిమిటెడ్ ఐపిఒ డిసెంబర్ 19 నుండి ఇష్యూను ప్రారంభించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు డిసెంబర్ 21 వరకు ఈ ఐపిఒ కోసం దరఖాస్సు చేసుకోవచ్చు. కంపెనీ షేర్లు డిసెంబర్ 27న ఎన్‌ఎస్‌ఇ, బిఎస్‌ఇలో లిస్ట్ కానున్నాయి. కంపెనీ ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.808 నుండి రూ.850 వరకు ఉంది. ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లను కొను గోలు చేయవచ్చు, దిని కోసం వారు రూ. 14,450 పెట్టుబడి పెట్టాలి. 5. ఆర్‌బిజెడ్ జ్యువెలర్స్ లిమిటెడ్ ఆర్‌బిజెడ్ జ్యువెలర్స్ లిమిటెడ్ ఈ ఐపిఒ ద్వారా రూ.100 కోట్లు సేకరించాలనుకుం టోంది. ఈ ఐపిఒ పూర్తిగా తాజా ఇష్యూ, రిటైల్ ఇన్వెస్టర్లు డిసెంబర్ 19 నుంచి డిసెం బర్ 21 వరకు ఈ ఐపిఒ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ షేర్లు డిసెంబర్ 27న ఎన్‌ఎస్‌ఇ, బిఎస్‌ఇలో లిస్ట్ కానున్నాయి. కంపెనీ ఈ ఇష్యూ ధరను రూ.95-100గా నిర్ణయించింది. 6. క్రెడో (బ్రాండ్స్ మార్కెటింగ్ క్రెడో (బ్రాండ్స్ మార్కెటింగ్ లిమిటెడ్ (So మెన్స్‌వేర్) ఈ ఐపిఒ ద్వారా రూ.549.78 కోట్లను సమీకరించనుంది. ఈ ఐపిఒ కూడా పూర్తిగా తాజా ఇష్యూ, దీని కోసం కంపెనీ 19,634,960 కొత్త షేర్లను జారీ చేస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు డిసెంబర్ 19 నుంచి డిసెం బర్ 21 వరకు ఈ ఐపిఒ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ షేర్లు డిసెంబర్ 27న ఎన్‌ఎస్‌ఇ, బిఎస్‌ఇలో లిస్ట్ కానున్నాయి. కంపెనీ ఈ ఇష్యూ ధరను రూ.266-280గా నిర్ణయించింది. 7. ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఈ ఐపిఒ ద్వారా రూ.740 కోట్లు సేకరించాలనుకుం టోంది. దీని కోసం కంపెనీ రూ.240 కోట్ల వి లువైన తాజా షేర్లను జారీ చేస్తుంది. అయితే రూ.500 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత పెట్టు బడిదారులు, ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తారు. రిటైల్ ఇన్వెస్టర్లు డిసెం బర్ 20 నుంచి డిసెంబర్ 22 వరకు ఈ ఐపిఒ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. షేర్లు డిసెంబర్ 28న లిస్ట్ కానున్నాయి. కంపెనీ ఈ ఇష్యూ ధరను రూ.499-524గా నిర్ణయించింది. 8. ఇన్నోవా క్యాప్‌టాబ్ లిమిటెడ్ ఇన్ఫోవా క్యాప్‌టాబ్ లిమిటెడ్ ఈ ఐపిఒ ద్వారా రూ.570 కోట్లను సమీకరించాలను కుంటోంది. దీని కోసం కంపెనీ రూ.320 విలువైన తాజా షేర్లను జారీ చేస్తుంది. అయితే రూ.250 విలువైన షేర్లను ప్రస్తుత పెట్టుబడి దారులు, ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తారు. రిటైల్ ఇన్వెస్టర్లు డిసెంబర్ 21 నుండి డిసెంబర్ ౭6 వరకు ఈ ఐపిఒ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. షేర్లు డిసెంబర్ 29న లిస్ట్ కానున్నాయి. కంపెనీ ఈ ఇష్యూ ధరను రూ.426-448గా నిర్ణయించింది.