ఈ వారం 11 ఐపీఠడఓులు ముంబై: దలాల్ స్ట్రీట్ ఈవారం కూడా బిజీబిజీగా ఉండబోతోంది. ఏడు మెయిన్‌బోర్డ్ ఇష్యూలతో సహా 11 ఐపీఓలు రూ. 4,000 కోట్లను సమీ కరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదే నెలలో ప్రారంభించిన ఐపీఓలకు ఇప్పటివరకు పెట్టు బడిదారుల నుంచి అద్భుతమైన స్పందనలు వచ్చాయి. మెజారిటీ ఐపీఓలు వారి ఇష్యూ ధర కంటే భారీ ప్రీమియంలతో లిస్ట్ అయ్యాయి. ఏడు మెయిన్‌బోర్డ్ ఐపీఓలు మొత్తంగా రూ. 3,910 కోట్లను, నాలుగు ఎస్‌ఎంఈ ఇష్యూలు రూ. 135 కోట్లను సేకరిస్తాయని అంచనా. మెయిన్‌బోర్ట్ ఐపీఓలలో ముతూట్ మైక్రోఫిన్, మోటిసన్స్ జు వెలర్స్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్, హ్యాపీ ఫోర్టిం గ్స్, ఆర్‌బీజెడ్ జ్యువెలర్స్, క్రెడో బ్రాండ్స్, ఆజాద్ ఇంజినీరింగ్ ఉన్నాయి. ఎస్‌ఎం ఈ విభాగంలో సహారా మారిటైమ్, ఎలక్ట్రో ఫోర్స్, శాంతి స్పిం టెక్స్, టైడెంట్ టెక్‌లాబ్స్ పబ్లిక్ ఆఫర్లు చూడవ చ్చు. కొన్నింటి గ్రేమార్కెట్ పైస్ (జీఎంపీ) 180 శాతం వరకు ఉంది. హ్యాపీ ఫోర్టింగ్స్ షేర్లు గ్రే మార్కెట్‌లో రూ. 460 వరకు పలుకుతున్నాయి. ఇష్యూ ధర కంటే 54శాతం ఎక్కువ. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ షేర్ల ధర గ్రే మార్కెట్‌లో రూ 65 ఉంది. ఇష్యూ ధర కంటే ఇది 18శాతం ఎక్కువ. ముత్తూట్ మైక్రోఫిన్ గ్రే మార్కెట్‌లో రూ. 88 ప్రీమియం ఉండగా, ఐపీఓ ఇష్యూ ధర కంటే 30శాతం ఎక్కువ. మోటిసన్స్ జ్యువెలర్స్ షేర్లు గ్రే మార్కెట్‌లో రూ. 100 ప్రీమియంతో దొరుకుతుండగా, ఐపీఓ ఇష్యూ ధర కంటే ఇది 182శాతం ఎక్కువ.