Limited trading this week

Monday 25th December, 2023

Article Details
  • View Image
  • View PDF
  • View Text

పరిమిత శ్రేణిలో కదలికలు క్రిస్మస్‌ సందర్భంగా నేడు ఎక్సేంజీలకు సెలవు च्छ ఆ కోవిడ్‌ కేసుల నమోదు; ఎర్ర సముద్రం పరిణామాలపై దృష్టి ఆ గురువారం ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ ఆ ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా ముంబై: ట్రేడింగ్‌ నాలుగు రోజులే జరిగే ఈ వారం లో స్టాక్‌ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. నెలవారీ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ ట్రేడింగ్‌ (గురవారం)కు సం బంధించి ఈ ఏడాదికిదే ఆఖరి వారం కావడంతో ట్రేడర్లు ఆచితూచి అడుగేసే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్‌ కేసులు, ఎర్ర సముద్రంలో అలజడుల పరిణామాలను మార్కెట్‌ వర్గాలు పరిశీలించవచ్చు. ఈ వారంలోని ఆయా కంపెనీల ఐపీఓలు, లిస్టింగులపైనా దృష్టి సారించే వీలుంది. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల క్రయవి Bored, డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్రూడాయిల్‌ కదలికలూ ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే వీలుంది. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా నేడు(సోమవారం) మార్కెట్లకు సెలవు. = "మార్కెట్‌లో ఇప్పటికీ సానుకూల వాతావ రణం కలిగి ఉంది. అయితే కొత్త ఏడాది ప్రారంభం, క్రిస్మస్‌ పండుగ సెలవుల నేపథ్యం లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి పెద్దగా సంకేతాలు అందకపోవచ్చు. రంగాల వారీ, స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌ దేశీయ ఈక్విటీ మార్కె ట్‌కు దిశానిర్దేశం చేయొచ్చు. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 21,000 20,950 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది. ఈ సాయిని కోల్పోతే లాభాల స్వీకరణ చోటు చేసుకో వచ్చు. ఎగువన 21,400 21,450 స్థాయిల్లో నిరోధం ఉంది. స్థిరీకరణలో భాగంగా, పతనమైన నాణ్యత కలిగి షేర్లను కొనుగోలు చేయొచ్చు'' అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సి యల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్దార్ట్‌ ఖేమా తెలిపారు. 4 ఐపీఓలు, 8 లిస్టింగులు... ట్రిడెంట్‌ టెక్‌లాబ్స్‌, సమీరా ఆగ్రో అండ్‌ ఇనా, సుప్రీం పవర్‌ ఎక్విప్‌మెంట్‌, ఇండిఫ్రా కంపెనీలు ఈ వారంలో ప్రాథమిక మార్కెట్‌ నుంచి నిధులు సమీకరణ సిద్ధమయ్యాయి. ఇక ఈ ఏడాది చివరి వారంలో 8 ప్రధాన కంపెనీల షేర్లు ఎక్స్పేంజీల్లో లిస్ట్‌ కాను న్నాయి. మోతీసన్స్‌ జ్యువెలరీస్‌, మూత్తూట్‌ మైక్రోఫిన్‌, సూరజ్‌ ఎస్టేట్‌ డెవెలపర్స్‌ షేర్లు మంగళవారం (డిసెంబర్‌ 26న), హ్యాపీ ఫోర్జిన్స్‌, ఆర్‌బీజెడ్‌ జ్యువెలరీస్‌, క్రెడో బ్రాండ్‌ ముఫ్టీ షేర్లు బుధవారం (డిసెంబర్‌ 27న), అజాద్‌ ఇంజనీరింగ్స్‌ (డిసెంబర్‌ 28న), ఇన్నోవా క్యాప్‌ట్యాబ్‌ కంపెనీల డిసెంబర్‌ 29 (గురువారం) లిస్ట్‌ కానున్నాయి. అ గరిష్ట స్థాయిల వద్ద స్థిరీకరణలో భాగంగా గత వారం సెన్ఫెక్స్‌ 87/ పాయింట్లు, నిఫ్లీ 10" పాయింట్లు చొప్పున నష్టపోయాయి. డిసెంబర్‌ £0( మంగళవారం) సెన్సెక్స్‌ "1,918, నిఫ్టి 21,598 వద్ద కొత్త జీవితకాల గరిష్ట స్థాయిలు నమోదు చేశాయి. పోటెత్తిన ఎఫ్‌పీఐల పెట్టుబడులు... విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్‌లో ఇప్పటికి వరకు (1-22 తేదీల మధ్య) రూ. 51,800 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఎఫ్‌పీఐల సెట్లుబడుల్లో ఇదే గరిష్టం. ''ఇటీవల జరిగిన ఐదురా అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో bas గెలుపొందడంతో బలమైన ఆర్థిక వృద్ధి, రాజ కీయ సుస్థిరత ఏర్పడొచ్చనే ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ స్థిరంగా తగ్గుతోంది. ఈ పరిణామాలు ఎఫ్‌ఐఐల కొనుగోళ్లను శ్రేరేపించాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గు తాయన్న ఊహాగానాలతో కొత్త ఏడా లోనూ భారత్‌ స్టాక్‌ మార్కెట్లలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది'' అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ వీకే విజయ కుమార్‌ తెలిపారు. ఈ ఏడాదిలో మొత్తంగా భారత్‌ స్టాక్‌ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.1.82 లక్షల కోట్ల మార్కును దాటేశాయి ఇక డెట్‌ మార్కెట్లోకి డిసెంబర్‌ నెలలో రూ. 15,545 కోట్ల ఎఫ్‌పీఐ నిధులు వచ్చి చేరాయి. గత నెలలో రూ.14,860 కోట్లు, అక్తోబర్‌లో 8,881 కోట్ల నిధులు వచ్చాయి. ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌తో పాటు ఆటోమొబైల్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, టెలికం రంగాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు ఎక్కువగా పెట్టుబడి పెట్టారని చెబుతున్నా! యి. గణాంకాలు